Manohar Joshi: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి కన్నుముశారు. రెండు రోజుల కిందట ఆయన గుండెపోటుతో ముంబాయిలో తుదిశ్వాస విడిచారు. గతేడాది నుంచి ఆయను ఆరోగ్యం సరిగ్గా లేదు.
మనోహర్ జోషి శివసేన పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 1995 నుంచి 1999 మధ్య మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో 2002-2004 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరించారు. 1937 డిసెంబర్ 2న నాంద్వీలో జోషి జన్మించారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మనోహర్ జోషి మొదట్లో ఉపాధ్యాయుడిగా పనిచేసి 1967లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1968-70 మధ్య మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. తర్వాత స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. 1967-77 మధ్య ముంబాయి మేయర్‌గా పనిచేశారు. 1972లో మహారాష్ట్ర శాసనమండలికి ఎన్నికయ్యారు. మూడు దఫాలు ఎమ్మెల్సీగా పనిచేసిన తర్వాత 1990లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 1990-91 మధ్య అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో శివసేన తరఫున ముంబయి నార్త్-సెంట్రల్ నియోజవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు.