Seema Deo Passes Away: ప్రముఖ నటి సీమా దేవ్ (Seema Deo) కన్నుమూశారు. ఆమె మరాఠీతోపాటు హిందీ సినిమాల్లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆరు దశాబ్దాల కాలం పాటు సినిమాల్లో నటించారు. అల్జీమర్స్, వయస్సు రీత్యా అనారోగ్యంతో 81 ఏళ్ల వయస్సులో బాంద్రాలో గల నివాసంలో మృతిచెందారు. జగచ్వా పతివార్, జునా తె సోనా, ఆనంద్, భాబీ కీ చుడీయాన్, కోరా కగాజ్, అప్రాద్, జానకీ, బెజుబాన్, కోశిష్, సంసార్, యెహి హై జిందాగీ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
సీమా (Seema Deo) భర్త రమేశ్ దేవ్ గత ఏడాది ఫిబ్రవరిలో చనిపోయాడు. తాను సీమకు ప్రేమను ఎలా వ్యక్తం చేశానో ఓ టీవీ కార్యక్రమంలో రమేశ్ వివరించాడు. షూటింగ్ సమయంలో ఎడ్ల బండి వద్ద ఉండగా.. జరిగిన ఘటనను గుర్తుచేసుకున్నాడు. షూటింగ్ సమయంలో సీమతో ఆమె తల్లి ఉండేదని.. ఒకరోజు ఎడ్లబండిని మరోవైపు తీసుకెళ్లానని వివరించాడు. తాను అలా చేయడాన్ని సీమ (Seema) సీన్లో భాగం అనుకుందని పేర్కొన్నాడు. ఇదీ సీన్ కాదని.. తన ప్రేమను తెలియజేశానని.. పెళ్లి చేసుకుంటావా.. అని అడగగా, అంగీకరించిందని వివరించాడు.
సీమ (Seema)- రమేశ్ కలిసి 20 సినిమాల్లో నటించారు. ఆనంద్, కోరా కగజ్, జగచ్య పఠివార్, వర్దాక్షిణ.. మోల్ కరీన్ అనే మరాఠీ సినిమాలో చేశారు. భర్త రమేశ్‌కు చెల్లి సరస్వతీచంద్ర అనే సినిమాలో సీమ నటించారు. 2014లో వీరిద్దరికీ రాజా పరంజపే లైఫ్ టైమ్ ఏచివ్ మెంట్ అవార్డు దక్కింది. సీమ- రమేశ్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. నటుడు అజింక్యా డియో, డైరెక్టర్ అభినయ్ డియో ఉన్నారు.