ప్రజా గాయకుడు గద్దర్ (Gaddar) అస్తమించాడు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలియనివారంటూ ఎవ్వరూ ఉండరు. అనారోగ్యంతో అపోలో ఆస్పత్రి(Apollo Hospital)లో చేరిన గద్దర్ చికిత్స తీసుకున్నారు. అయితే ఆదివారం ఆయన చికిత్స పొందుతూ మరణించారు. తెలంగాణ ఉద్యమం(Telangana vudyamam)లో తన పాటలతో ప్రజలను గద్దర్ చైతన్యపరిచారు.
తన మాటలు, పాటల(Songs) ద్వారా ఎంతో మంది ఉద్యమకారులకు స్ఫూర్తిని పంచారు. తెలంగాణ(Telangana)కు జరిగిన అన్యాయాన్ని పాటలతో చెప్పి ప్రజలను తట్టిలేపాడు. ఈ మధ్యనే ఆయన గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో ఆయన అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అక్కడే చికిత్స తీసుకుంటూ గద్దర్(Gaddar) తుదిశ్వాస విడిచారు.