వచ్చే ఏడాది కీలకం కానుంది. సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో అధికార పార్టీ అందరికీ గుడ్‌న్యూస్‌లు చెబుతూ వస్తున్నాయి. విపక్ష పార్టీలు కూడా తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు రహస్యంగానే పలు సర్వేలను నిర్వహించాయి. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ (BJP) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎన్టీయే(NDA) నేతలు అద్బుతమైన వ్యూహ రచనతో ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. ఇటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
తాజాగా దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న కోటి మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు శుభవార్త చెప్పింది. వారికి ఆర్థిక ప్రయోజనాన్ని కల్పించే దిశగా చర్యలు తీసుకోనుంది. కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు (Central Govt Employees) కరువు భత్యాన్ని పెంచనుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 42 శాతం కరువు భత్యం అందుతుండగా దాన్ని నెలవారీ వేతనంతో కలిపి చెల్లిస్తూ ఉంది.
ప్రస్తుతం ఇప్పుడున్నదాని కంటే మరో మూడు శాతాన్ని అదనంగా ఇవ్వనున్నట్లు కేంద్ర వెల్లడించింది. దీంతో కరువుభత్యం 45 శాతానికి చేరుకుంది. ఈ డీఏ (DA) పెంపుదల జూలై 1వ తేది నుంచి అమలులోకి రానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. త్వరలోనే అధికారికంగా ప్రకటనను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.