7th Pay Commission : హోలీకి ముందే మోడీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల డియర్నెస్ అలవెన్స్‌ను 46 శాతం నుంచి 50 శాతానికి పెంచారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కరువు భత్యాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. డియర్నెస్ అలవెన్స్ జనవరి 1 నుండి జూన్ 30, 2024 వరకు పెంచబడింది. 2024 మార్చి 7వ తేదీ గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో డియర్నెస్ అలవెన్స్‌ను 46 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని నిర్ణయించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 49 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.