VZM: కుసుమంచి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుసుమంచి సుబ్బారావు ఆధ్వర్యంలో ఉల్లివీధి ఆర్యవైశ్య భవనంలో నిరుపేదలైన 200 మంది ఆర్యవైశ్యలకు వస్త్రాల వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాపుగంటి శ్రీనివాస్ హాజరై, ఆయన సేవలు కొనియాడారు. ఇందులో వెత్సా శ్రీనివాసరావు, గురుప్రసాద్, ఏడుకొండలు, ఎంవీర్ పాల్గొన్నారు.