»Started By Prime Minister Modi 508 Railway Stations Redevelopment India
Prime Minister Modi:చే ప్రారంభం..తెలుగు రాష్ట్రాల్లో డెవలప్ కానున్న స్టేషన్లు ఇవే
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలోని 21, ఆంధ్రప్రదేశ్లోని 18 స్టేషన్లు సహా దాదాపు 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Modi) ఆదివారం(ఆగస్టు 6న) శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో ఆయా స్టేషన్లలో(railway stations) రైల్వే మౌలిక సదుపాయాలను మరింత అప్గ్రేడ్ చేయనున్నారు.
Started by Prime Minister Modi 508 station redevelopment india
దేశంలో వివిధ ప్రాంతంలో రైల్వే ఆధునీకరణ పనులు ప్రారంభం అయ్యాయి. పలు రాష్ట్రాల్లో 508 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను ప్రధాని మోడీ(Prime Minister Modi) ఈరోజు(ఆగస్టు 6న) వర్చువల్గా ప్రారంభించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో మల్కాజిగిరి రైల్వే స్టేషన్ సహా పలు చోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాయి. ఈ స్టేషన్ ఆధునీకరణ పనుల కోసం కేంద్రం రూ. 26.7 కోట్ల రూపాయలను కేటాయించింది. మోడీ వర్చువల్గా ప్రారంభించే సమయంలో తెలంగాణకు చెందిన సీనియర్ బీజేపీ నాయకులు నాంపల్లి రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, బిజెపి జాతీయ నాయకుడు మురళీధర్ రావు, బిజెపి నాయకులు, స్థానిక కార్పొరేటర్లు, ప్రజలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత మల్కాజిగిరి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు ప్రారంభం కావడం పట్ల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలోని 21 రైల్వే స్టేషన్ల(railway stations)కు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుపై రైల్వేశాఖ తెలంగాణలో రూ.894.09 కోట్లు ఖర్చు చేయనుంది. తెలంగాణ(telangana) రాష్ట్రం నుంచి ఎంపికైన స్టేషన్లలో ఆదిలాబాద్, కాజీపేట జంక్షన్, హఫీజ్ పేట, ఉప్పుగూడ, నాంపల్లి, మలక్ పేట, జనగాం, కరీంనగర్, ఖమ్మం, మధిర, భద్రాచలం రోడ్, హైటెక్ సిటీ, మహబూబాబాద్, మహబూబ్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్ జంక్షన్, జహీరాబాద్, రామగుండం, మల్కాజిగిరి జంక్షన్, తాండూరు, యాదాద్రి భువనగిరి ఉన్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ల్(Andhra pradesh)మొత్తం 18 ఎంపిక కాగా వాటిలో.. కాకినాడ టౌన్ జంక్షన్, తుని, పిడుగురాళ్ల, రేపల్లె, తెనాలి, కర్నూలు, దొనకొండ, ఒంగోలు, సింగరాయకొండ, పలాస, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం జంక్షన్, భీమవరం పట్టణం, ఏలూరు, నరసాపూర్, నిడదవోలు జంక్షన్, తాడేపల్లిగూడెం ఉన్నాయి. మొదటి దశలో రూ.369.60 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్లో న లుగు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న 50 రైల్వే స్టేషన్లు తిరిగి అభివృద్ధి చేయబడుతున్నాయి. వాటిలో తెలుగు మాట్లాడే రాష్ట్రాలకు చెందిన 36 రైల్వే స్టేషన్లు ప్రయోజనం పొందుతున్నాయి.
యూపీ, రాజస్థాన్ (55 చొప్పున), బీహార్ (49), మహారాష్ట్ర (44), పశ్చిమ బెంగాల్ (37), మధ్యప్రదేశ్ (34), అస్సాం (32), ఒడిశా (25), పంజాబ్ (22) లాభపడే ఇతర రాష్ట్రాలు. గుజరాత్ (21), జార్ఖండ్ (20), ఆంధ్రప్రదేశ్(18), తమిళనాడు (18), హర్యానా (15) కర్ణాటక నుంచి 13 ఎంపికయ్యాయి. మొత్తం 1,309 స్టేషన్లను తిరిగి అభివృద్ధి చేయడానికి ఈ పథకం ప్రారంభించబడింది. ఈ రోజు భారతరైల్వే చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని రోజని ప్రధాని నరేంద్ర మోడీ(modi) తెలిపారు. రైల్వే ఆధునీకరణ పనులన వర్చువల్గా ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ ప్రసంగించారు. భారత రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా రూ.2,079.29 కోట్ల వ్యయంతో 508 రైల్వే స్టేషన్లు మరింత అభివృద్ధి చెందనున్నాయి.