»Live Tv Channel On Phone Without Internet Anymore
DTM : ఇక ఇంటర్నెట్ లేకుండానే ఫోన్లో లైవ్ టీవీ ఛాన్సల్
మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు.. అందులో టీవీ ప్రసారాలు వస్తాయ్.. ఇంటర్నెట్ లేకుండా మొబైల్లో టీవీ ప్రసారాలు ఎలా వస్తాయని ఆశ్చర్యపోతున్నారా.. సాధ్యమే అంటోంది కేంద్ర ప్రభుత్వం.
ప్రస్తుతం భారత దేశంలో 22 కోట్ల టీవీ కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. కానీ స్మార్ట్ ఫోన్లు (Smart phones) మాత్రం 80 కోట్లకు పైనే ఉన్నాయి. 2026 నాటికి దేశవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లు వాడే వారి సంఖ్య 100 కోట్లకు చేరుతుందని అంచనా. ఇంటర్నెట్(Internet) ట్రాఫిక్‌లో 80 శాతం వాటా వీడియో వినియోగానిదే. టీవీలతో పాటు ఇతర కమ్యూనికేషన్ డివైజ్లతో పోల్చితే అన్ని రకాల కమ్యూనికేషన్లకు, ఎంటర్టైన్మెంట్కు అనువైనది మొబలై ఫోన్ మాత్రమే.
అందుకే బ్రాడ్కాస్ట్(Broadcast), బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను మిళితం చేసి డైరెక్ట్ టు మొబైల్ ( DTM) సేవలు అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. టీవీలు చూసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోవడంతో స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడంతో డైరెక్టర్ టు మొబైల్ టెక్నాలజీ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నా.. దీన్ని ప్రముఖ టెలికామ్ ఆపరేటర్లు (Telecom operators) వ్యతిరేకించే అవకాశాలున్నాయి. DTM సర్వీసులు అందుబాటులోకి వస్తే డేటా రెవెన్యూ దారుణంగా పడిపోతుంది. బ్రాడ్‌బ్యాండ్, బ్రాడ్కాస్ట్ ఈ రెండు టెక్నాలజీలను అనుసంధానం చేయడం ద్వారా డైరెక్టు టు మొబైల్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. మొబైల్ ఫోన్లలో ఎఫ్ఐం ప్రసారాలు ఎలా జరుగుతాయో.. అదే తరహాలో.. terrestrial digital TV సిగ్నల్స్‌ను కూడా ఇంటర్నెట్ సాయం లేకుండానే మొబైల్స్ అందుకుంటాయి..
ఆడియో , వీడియోలతో పాటు మల్టీ మీడియా (Multi media) కంటెంట్‌ను కూడా ఈ టెక్నాలజీ ద్వారా ఫోన్లు రిసీర్ చేసుకోగలుగుతాయి. ఇంటర్నెట్ లేకపోయినా.. పనిచేయడమే ఈ వ్యవస్థ గొప్పతనం. స్మార్ట్ ఫోన్లు అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరి జీవితాలు స్మార్ట్ఫోన్లలోనే గడిచిపోతున్నాయి. టెక్నాలజీ ఆ స్థాయిలో ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తోంది. ఇలాంటి సమయంలో ఇంటర్నెట్(Internet)తో సంబంధం లేకుండా మొబైల్లోనే లైవ్ టీవీ (Live TV) ప్రసారాలను అందించాలనుకుంటోంది కేంద్రం.