తెలంగాణలో ఎన్నికల సీజన్ మొదలైంది. ఈనెలలోనే బీఆర్ఎస్ పార్టీ చీఫ్ సీఎంకేసీఆర్(CM KCR) తొలి విడత అభ్యర్థులను ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రగతి భవన్ నుంచి వచ్చే కాల్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేలు(Sitting MLAs), ఆశావహులు ఎదురుచూస్తున్నారు. దీంతో స్మార్ట్ ఫోన్ల(Smart phones)ను పక్కనపెట్టి చాలామంది ఎమ్మెల్యేలు చిన్న ఫోన్లు కొంటున్నారట. ఏ క్షణమైనా ఫోన్ రావొచ్చనే ఉద్దేశంతో స్మార్ట్ ఫోన్లను పీఏలు, గన్మెన్లకు ఇచ్చి చిన్న ఫోన్ మాత్రం తమ వద్దే పెట్టుకుంటున్నారట.అధిక శ్రావణం ముగిసి నిజ శ్రావణ మాసం ప్రారంభం కాగానే బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అభ్యర్థుల ప్రకటన ఉంటుందనే ప్రచారం ఆ పార్టీలో జోరుగా సాగుతున్నది. ఫామ్‌హౌజ్‌లో ఉన్న పార్టీ అధినేత కేసీఆర్.. ఇందుకోసం ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్టు పార్టీ వర్గాలే పేర్కొన్నాయి. సరిగ్గా ఈ టైమ్‌లో కేసీఆర్ నుంచి ఫోన్ రావడంతోనే ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.
తీపి కబురు చెపుతారా?.. లేక టికెట్‌కు కోత పెడతారా?.. అని టెన్షన్ పడుతున్నారు. ఫోన్ కాల్స్(Phone calls) వస్తున్నది ఎక్కువగా నెగిటివ్ రిపోర్టు ఉన్న సిట్టింగులకే కావడంతో వారిలో ఆందోళన నెలకొన్నది. ఫోన్ చేసి ఫామ్ హౌజ్‌కు పిలిపించుకుని వారికి అధినేత కౌన్సెలింగ్ ఇస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్ని సార్లు చెప్పినా పనితీరు ఎందుకు మార్చుకోలేదని చివాట్టు పెడుతున్నట్టు సమాచారం.సర్వే రిపోర్టులపై ఎక్కువగా ఆధారపడే కేసీఆర్.. రెగ్యులర్‌గా వాటిని ఫాలో అప్ చేస్తూ ఉంటారు. ఒకవైపు స్టేట్ ఇంటెలిజెన్స్, మరోవైపు పార్టీ సీనియర్ల నుంచి తాజా స్టేటస్.. వీటికి అదనంగా థర్డ్ పార్టీ (Third party) నుంచి నివేదికలు.. ఇలా ఏకకాలంలో వీటిపై గులాబీ బాస్ ఫోకస్ పెడుతుంటారు. ఫస్ట్ లిస్టులో ఎవరెవరి పేర్లు పెట్టాలన్నదానికీ ప్రామాణికం ఈ సర్వే నివేదికల్లోని అంశాలే. ప్రస్తుతం జరుగుతూ ఉన్న సర్వేలో వచ్చే ఫలితాల ఆధారంగా టికెట్లపై కేసీఆర్ ఫైనల్ డెసిషన్ (Final decision) తీసుకుంటున్నారని టాక్. ఆ సర్వేలో వచ్చే ఫీడ్ బ్యాక్ తమ రాజకీయ జాతకాన్ని నిర్ణయిస్తున్నదని పార్టీ నేతలు మొత్తుకుంటున్నారు.