ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్డ్ (Flip kart) మరోసారి భారీ ఆఫర్లతో వినియోగదారుల. ఆకర్షించేందుకు పోటాపోటీగా డిస్కౌంట్లతో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.ఈ నెల 11 నుంచి అంటే రేపటి నుంచే భారీ ఆఫర్లతో బిగ్ సేవింగ్ డేస్ సేల్(Flipkart Big Saving Days Sale) ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ లో ఎలక్ట్రానిక్ వస్తువుల(Electronic goods)పై ఏకంగా 75 శాతం వరకు తగ్గింపులు ఉంటాయని తన సేల్స్ పేజీలో ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. ఈ సమ్మర్ లో ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు, స్మార్ట్ టీవీలు కొనాలని ప్లాన్ చేసే వారికి ఈ సేల్ మంచి ఛాన్స్ అని చెప్పాలి. చాలా తక్కువ ధరకే డిస్కౌంట్ల(Discounts)తో ఈ వస్తువులను సేల్ లో సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్ లో ఏసీలను రూ.21,490 ప్రారంభ ధరతో కొనుగోలు చేసుకోవచ్చు. మైక్రోవేవ్ ఓవెన్స్ ను 45 శాతం డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.సాంసంగ్(Samsung), ఎల్జీ, ఓల్టాస్ తదితర కంపెనీలకు చెందిన ఎనర్జీ ఎఫీషియంట్ ఏసీలపై రూ.40 వేల వరకు తగ్గింపు ఉంటుందని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.
ఇంకా టాప్ వాటర్ ప్యూరిఫైయర్ లపై 70 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. 4&5 రిఫ్రిజిరేటర్లను రూ.13,990 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.ఫ్లిప్ కార్ట్ లో రేపటి (ఆగస్టు 11) నుంచి 13 వరకు బిగ్ బచత్ ధమాల్ సేల్ పేరుతో విక్రయాలు చేపట్టనున్నారు. బిగ్ బచత్ ధమాల్ సేల్ లో 1 లక్షకు పైగా వస్తువులు రాయితీ (Concession) ధరలకు లభ్యం కానున్నాయి. కొన్ని వస్తువులపై ఏకంగా 80 శాతం డిస్కౌంటు ఇస్తుండడం నిస్సందేహంగా వినియోగదారులను ఆకట్టుకునే అంశమే. దుస్తులు, ఫ్యాషన్ ఉపకరణాలపై 60-80 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఎప్పట్లాగానే స్మార్ట్ ఫోన్ల (Smart phones) వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై భారీ తగ్గింపులు ఉండనున్నాయి. వాషింగ్ మెషీన్లపై 60 శాతం డిస్కౌంట్లు ఇచ్చే అవకాశాలున్నాయి. క్రెడిట్ కార్డు(Credit card)ల ద్వారా కొనుగోళ్లతో మరో 10 శాతం వరకు అదనపు రాయితీ పొందే వీలుంది.