»Government Is Using Ai Tool To Check Frauds In Ayushman Bharat Health Scheme Know Details Of Scheme
Ayushman Bharat Yojana: నకిలీ ఆయుష్మాన్ భారత్ కార్డులను గుర్తించేందుకు ఏఐ టెక్నాలజీ
పేద, అల్పాదాయ వర్గాలకు చెందిన ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద లబ్ధిదారులు రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా ప్రయోజనం పొందుతారు.
Ayushman Bharat Yojana: ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY) ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య పథకాలలో ఒకటి. దీన్ని 2018 సెప్టెంబర్ 23న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ నెల ఒకటవ తేదీ వరకు దేశవ్యాప్తంగా మొత్తం 24.33 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. వారిలో చాలా వరకు నకిలీవి ఉన్నాయని సర్వేలో తేలింది. దీంతో నకిలీల ఏరివేతకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు గాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML)లను ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకంలో సుమారు 7.5 లక్షల మంది లబ్ధిదారులు ఒకే మొబైల్ నంబర్లో నమోదు చేసుకున్నారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(CAG) తెలిపింది. పథకం ప్రయోజనాలను అర్హులైన వారికి అందించడానికి AI సాంకేతికతను ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా మోసాలను అరికట్టవచ్చు. ఇప్పుడు కృత్రిమ మేధస్సు ద్వారా నకిలీ కార్డులను గుర్తించనున్నారు.
ఆయుష్మాన్ భారత్ పథకం అంటే ఏమిటి?
పేద, అల్పాదాయ వర్గాలకు చెందిన ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద లబ్ధిదారులు రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా ప్రయోజనం పొందుతారు. ఈ పథకంలో నమోదు చేసుకున్న కార్డుదారుడు ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రిలో రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చు. ఈ పథకం కింద గిరిజన (SC / ST), నిరాశ్రయులైన, నిరుపేదలు, దాతృత్వం లేదా బిచ్చగాళ్లు, కార్మికులు మొదలైనవారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. పెద్ద సంఖ్యలో మహిళలు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన డేటాలో మొత్తం లబ్ధిదారుల్లో 49 శాతం మంది మహిళలే ఉన్నారు.
PMJAY ప్రత్యేక లక్షణాలు
ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన దానినే ఆయుష్మాన్ భారత్ యోజన అంటారు. దేశంలోని ప్రతి పేదవాడు ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రిలో రూ. 5 లక్షల వరకు చికిత్స పొందవచ్చు. ఇందులో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి 15 రోజుల వరకు ఆసుపత్రి ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. కుటుంబ సభ్యులందరూ ఆరోగ్య పథకం ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో ఎలాంటి వయోపరిమితిని నిర్ణయించలేదు. నగదు రహిత చికిత్స ద్వారా లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలనుకుంటే అధికారిక వెబ్సైట్ pmjay.gov.inని సందర్శించండి.