»Toll Plaza Long Delay Toll Tax Driver Union Minister Nitin Gadkari
Toll Tax: టోల్ గేట్ వద్ద 10 సెకన్ల కంటే ఎక్కువ ఆగితే.. ట్యాక్స్ కట్టక్కర్లేదు ?
16 ఫిబ్రవరి 2021 నుండి దేశంలోని అన్ని టోల్ ప్లాజాలపై ఫాస్ట్‌ట్యాగ్‌ని తప్పనిసరి చేసిన తర్వాత చాలా ప్రయోజనం కలిగిందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభకు తెలిపారు.
Toll Tax: ప్రస్తుతం దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఏ హైవే ఎక్కినా టోల్ మోత మోగిపోతుంది. దీంతో జనాలు నానాయాతన పడుతున్నారు. ప్రయాణ దూరానికి ఎంతైతే ఖర్చు చేస్తున్నారో అందులో సగభాగం టోల్ చార్జీలకే పోతుంది. టోల్ గేట్లకు సంబంధించిన కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. టోల్ టాక్స్ నిబంధనలకు సంబంధించిన అనేక తప్పుదారి పట్టించే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టోల్ ప్లాజా వద్ద 100 మీటర్ల కంటే ఎక్కువ పొడవైన లైన్ ఉంటే టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని వార్తలు వస్తున్నాయి.. మరి కొన్ని సార్లు టోల్ ప్లాజా వద్ద 10 సెకన్ల కంటే ఎక్కువ వేచి ఉండవలసి వస్తే టోల్ టాక్స్ కట్టాల్సిన అవసరం లేదని వినిపిస్తోంది.
దీంతో ఇలాంటి వార్తలు విన్న ప్రయాణికులు హైవేపై వెళ్ల సమయంలో నిజమని నమ్మి టోల్ కార్మికులతో వాగ్వాదానికి దిగుతున్నారు. అయితే ఇప్పుడు ఈ తప్పుదారి పట్టించే వార్తలన్నింటినీ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఖండించింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో ఒక ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానం ఇస్తూ.. మంత్రిత్వ శాఖ అటువంటి వాటికి ఆమోదం తెలపలేదని అన్నారు. ఇలాంటి వార్తలకు సంబంధించి మంత్రిత్వ శాఖ లేదా ఎన్హెచ్ఏఐతో ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. ఏదైనా వాహన డ్రైవర్ టోల్ ప్లాజా వద్ద నిర్ణీత సమయం కంటే ఎక్కువ వేచి ఉన్న తర్వాత కూడా టోల్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
16 ఫిబ్రవరి 2021 నుండి దేశంలోని అన్ని టోల్ ప్లాజాలపై ఫాస్ట్‌ట్యాగ్‌ని తప్పనిసరి చేసిన తర్వాత చాలా ప్రయోజనం కలిగిందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభకు తెలిపారు. ప్రయోజనాలు లేదా ప్రభావాన్ని అంచనా వేయడానికి NHAI ఫిబ్రవరి 2021 – నవంబర్ 2021 మధ్య ఒక అధ్యయనాన్ని నిర్వహించిందని ఆయన చెప్పారు. ఫాస్ట్‌ట్యాగ్‌ని తప్పనిసరి చేసిన తర్వాత టోల్‌ప్లాజా వద్ద సగటు నిరీక్షణ సమయం 734 సెకన్ల నుండి 47 సెకన్లకు తగ్గింది.