»Central Government To Offload Additional Wheat Rice Via Open Market To Reduce Prices
Prices Hike: ఆకాశాన్నంటుతున్న గోధుమలు, బియ్యం ధరలు.. సూపర్ ప్లాన్ వేసిన ప్రభుత్వం!
బహిరంగ మార్కెట్లో అదనంగా 5 మిలియన్ టన్నుల గోధుమలు, 2.5 మిలియన్ టన్నుల బియ్యాన్ని విడుదల చేయాలని కేంద్రం బుధవారం నిర్ణయించింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఓపెన్ సేల్ స్కీమ్ బియ్యం రిజర్వ్ ధరను క్వింటాల్‌కు రూ.200 తగ్గించి రూ.2,900గా నిర్ణయించింది.
Prices Hike: దేశంలో ఆహార ధాన్యాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. బియ్యం ధరలు దాదాపు 15ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. దీంతో ప్రభుత్వం కొన్ని రకాల బియ్యం ఎగుమతిపై నిషేధం విధించింది. మరోవైపు, గోధుమ ధర కూడా 6 నుండి 7 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు సామాన్యులకు ఊరటనిచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది.బహిరంగ మార్కెట్లో గోధుమలు, బియ్యం సరఫరాను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బహిరంగ మార్కెట్లో అదనంగా 5 మిలియన్ టన్నుల గోధుమలు, 2.5 మిలియన్ టన్నుల బియ్యాన్ని విడుదల చేయాలని కేంద్రం బుధవారం నిర్ణయించింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఓపెన్ సేల్ స్కీమ్ బియ్యం రిజర్వ్ ధరను క్వింటాల్‌కు రూ.200 తగ్గించి రూ.2,900గా నిర్ణయించింది. దీంతో వ్యాపారులు సైతం స్పీడ్‌గా ధాన్యాన్ని తీసుకుంటారని, దీనిపై ఇప్పటి వరకు వ్యాపారుల నుంచి మంచి స్పందన కనిపించింది. జూన్‌లో ప్రారంభమైన మొదటి ఓపెన్ సేల్ స్కీమ్‌లో కేటాయించిన 1.5 మిలియన్ టన్నుల గోధుమలలో దాదాపు 0.82 మిలియన్ టన్నులు (55 శాతం) కొనుగోలుదారులు కొనుగోలు చేశారు. బియ్యం విషయానికొస్తే, ఇది అధ్వాన్నంగా ఉంది. ప్రతిపాదిత 0.5 మిలియన్ టన్నులలో 0.38 శాతం మాత్రమే సేకరించబడింది. PDS, ఇతర సంక్షేమ పథకాల అవసరానికి మించి 28.7 మిలియన్ టన్నుల మిగులు గోధుమలు, బియ్యం తమ వద్ద ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ధరలను తగ్గించేందుకు అవసరమైనప్పుడు మార్కెట్లో లభిస్తాయి. గోధుమల దిగుమతి సుంకాన్ని తగ్గించే అవకాశం ఉన్నందున అవసరాన్ని బట్టి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.
రిజర్వ్ ధరలో మార్పు
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) జూన్ 28 నుండి ఇ-వేలం ద్వారా OMSS కింద పిండి మిల్లు యజమానులు, చిన్న వ్యాపారులు వంటి బల్క్ కొనుగోలుదారులకు గోధుమలు, బియ్యాన్ని విక్రయిస్తోంది. ఈ రెండింటి ధరలు గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తున్నాయని ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా మీడియాకు తెలిపారు. OMSS కింద గోధుమలు తీసుకోవడం ఇప్పటివరకు బాగానే ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో జూన్ 28 న OMSS ఆపరేషన్ ప్రారంభించబడిందని ఎఫ్‌సిఐ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ కె మీనా తెలిపారు. గోధుమలు, బియ్యం ధరల్లో పెరుగుతున్న ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇది జరిగింది. బుధవారంతో కలిపి ఇప్పటివరకు ఏడు ఈ-వేలం జరిగింది. మొదట్లో 4 లక్షల టన్నులు విక్రయించే గోధుమలు, బుధవారం నాటి ఈ-వేలంలో లక్ష టన్నులకు తగ్గాయి. ఇప్పటి వరకు 8 లక్షల టన్నుల గోధుమలు విక్రయించినట్లు వారు తెలిపారు. ప్రారంభంలో జూన్ 28న గోధుమల సగటు ధర క్వింటాల్‌కు రూ.2,136.36గా ఉందని మీనా పేర్కొన్నారు. బుధవారం నాటి ఈ-వేలంలో ఇప్పుడు రూ.2,254.71గా మారింది. మార్కెట్లో గోధుమలకు డిమాండ్ పెరుగుతోందని ఇది తెలియజేస్తోందన్నారు.