జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా బీమా రంగం(Insurance sector)లోకి వస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. దీని ద్వారా సాధారణ, ఆరోగ్య బీమా సేవలు అందిస్తామని.. జియో, రిటైల్ తరహాలోనే ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో అందరికీ 5జీ నెట్ వర్క్ (5G network) అందిండమే లక్ష్యమని చెప్పారు. ఇవాళ రిలయన్స్ (Reliance)44వ వార్షిక సమావేశంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అటు ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అయిన బ్లాక్‌రాక్‌తో కలిసి అసెట్‌మెంట్ మేనేజ్మెంట్ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
ఫైబర్ కేబుల్ అవసరం లేకుండా తీసుకు వస్తోన్న జియో ఎయిర్ ఫైబర్‌ను వినాయక చవితి(Lord Vinayaka)కి ప్రారంభించనున్నట్లు రిలయన్స్ ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) అన్నారు. సంస్థ 46వ వార్షిక సాధారణ సదస్సులో వాటాదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక ప్రకటనలు చేశారు. గత పదేళ్లలో కంపెనీ 150 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు ఆయన చెప్పారు. ఇతర ఏ కార్పోరేట్ కంపెనీ ఈ స్థాయి పెట్టుబడులు పెట్టలేదని అన్నారు. రిలయన్స్ కొత్త తరం టెక్నాలజీ కంపెనీగా అవతరించిందన్నారు.దేశంలో జియో యూజర్ల (Jio users) సంఖ్య 45 కోట్లు దాటినట్లు వెల్లడించారు.
సగటు వినియోగం నెలకు 25 జీబీగా ఉందని తెలిపారు. 5 కోట్ల మంది జియో వినియోగదారులు 5జీ వినియోగిస్తున్నట్లు చెప్పారు. 2జీ వినియోగదారులను 4జీకి మార్చేందుకు జియో భారత్ ఫోన్(Jio Bharat Phone)ను కేవలం రూ.999కే తీసుకు వచ్చామన్నారు. దేశంలో అందరికీ 5జీ నెట్ వర్క్ అందించడమే లక్ష్యమని, డిసెంబర్ నాటికి అందిస్తామన్నారు. ఫైబర్ కేబుల్ అవసరంలేని జియో ఎయిర్ ఫైబర్‌ను వినాయక చవితికి లాంచ్ చేస్తున్నామని, సెప్టెంబర్ 19న దీనిని తీసుకు వస్తున్నామన్నారు.జియో సినిమా(Jio movie) వేదికగా 45 కోట్ల మంది ఐపీఎల్ ప్రసారాలను వీక్షించారని, ఫైనల్ మ్యాచ్‌ను 12 కోట్ల మంది చూశారన్నారు. రిలయన్స్ (Reliance)నికర లాభం పెరిగినట్లు తెలిపారు.