సూర్యుడిపై పరిశోధనల కోసం వచ్చే నెల 2న ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట (Sriharikota) నుంచి ఆదిత్య L1 ప్రయోగాన్ని చేపడుతున్నట్లు ఇస్రో ప్రకటించింది. PSLV-C57 రాకెట్ ఆదిత్య ఉపగ్రహాన్ని మోసుకెళ్తుందని పేర్కొంది. ఈ ప్రయోగాన్ని వీక్షించడానికి పౌరులు https://www.isro.gov.in/ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 (Chandrayaan-3)ని విజయవంతంగా దించి అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను లఖించింది భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO). ఇప్పుడు అదే ఉత్సాహంపై సూర్యుడి (Sun) రహస్యాలను కనుగొనేందుకు ఇస్రో సిద్ధమైంది.
సెప్టెంబరు 2వ తేదీన ఆదిత్య-ఎల్ 1 (Aditya-L1) ప్రయోగం చేపట్టనుంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు.సెప్టెంబరు 2న ఈ ప్రయోగం చేపట్టే అవకాశాలున్నాయి’’ అని సదరు అధికారి చెప్పారు. ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)కు తీసుకొచ్చారు. పీఎస్ఎల్వీ-సి57 వాహకనౌక.. ఆదిత్య-ఎల్ 1 (Aditya-L1 )ను మోసుకుని నింగిలోకి దూసుకెళ్లనుంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో (ISRO) సౌర అధ్యయన ప్రక్రియను చేపట్టనుంది.