»The Rover That Tested The Moons Temperature Chandrayaan 3 Sent The Report
ISRO: చంద్రుని ఉష్ణోగ్రతను పరీక్షించిన రోవర్..నివేదిక పంపిన చంద్రయాన్-3
జాబిల్లి నుంచి చంద్రయాన్-3 ఇస్రోకు కీలక నివేదిక పంపింది. చంద్రుని ఉష్ణోగ్రతపై ప్రజ్ఞాన్ రోవర్ పరీక్ష చేసిందని, ఓ నివేదికను అందించినట్లు ఇస్రో వెల్లడించింది.
ఇస్రో శాస్త్రవేత్తలు (ISRO scientists) ప్రయోగించిన చంద్రయాన్-3 (Chandrayan-3) సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. చంద్రుని (Moon) దక్షిణ ధృవంపై చంద్రయాన్3 ల్యాండ్ అవ్వడంతో ఇండియా హిస్టరీ క్రియేట్ చేసింది. దాదాపుగా 3 లక్షల 84 వేల 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్ (Pragyan Rover) అధ్యయనం చేయనుంది.
చంద్రయాన్-3 పంపిన నివేదిక:
Chandrayaan-3 Mission: Here are the first observations from the ChaSTE payload onboard Vikram Lander.
ChaSTE (Chandra's Surface Thermophysical Experiment) measures the temperature profile of the lunar topsoil around the pole, to understand the thermal behaviour of the moon's… pic.twitter.com/VZ1cjWHTnd
తాజాగా చంద్రుడి (Moon)పై అధ్యయనం ప్రారంభించిన ప్రజ్ఞాన్ రోవర్ (Pragyan Rover) గురించి ఇస్రో (ISRO) కీలక సమాచారాన్ని అందించింది. ఈసారి ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని ఉష్ణోగ్రత నివేదికను ఇస్రోకు పంపించింది. రోవర్ పగటి ఉష్ణోగ్రత 50 సెల్సియస్ నుంచి 10 సెల్సియస్ వరకు ఉందని ఆ నివేదిక తెలుపుతోంది. ఈ సమాచారాన్ని ఇస్రో ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. చంద్రుడిపై ఉష్ణోగ్రతను వెల్లడించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ నుంచి 60 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చంద్రుని(Moon)పై నమోదవుతున్నట్లు ఇస్రో గ్రాఫ్‌తో ఉన్న నివేదికను పోస్ట్ చేసింది. సెన్సార్ల ద్వారా చంద్రుని ఉష్ణోగ్రతను రోవర్ పరీక్షించిందని, చంద్రుడిపై 10 సెంటీమీటర్ల లోతుకు 10 సెన్సార్లు దిగాయని ఇస్రో(ISRO) వెల్లడించింది. మరోవైపు ఈ ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద మట్టిని అధ్యయనం చేస్తోందని తెలిపింది. ప్రజ్ఞాన్ రోవర్ శివశక్తి పాయింట్ చుట్టూ తిరుగుతోందని, చంద్రుని దక్షిణ ధృవ రహస్యాలను అన్వేషిస్తోందని ఇస్రో వెల్లడించింది.