ISRO: కౌంట్ డౌన్ స్టార్ట్.. రేపే నింగిలోకి ఇస్రో మరో ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. కొత్త సంవత్సరం తొలిరోజే మరో రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైందని ఇస్రో వెల్లడించింది.
ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. కొత్త సంవత్సరం తొలిరోజే మరో రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైందని ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1 విజయవంతంగా ప్రయోగించిన తరువాత, ఇస్రో రేపు PSLV రాకెట్ ద్వారా స్వదేశీ ఎక్స్-రే పోలారిమీటర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 9.10 గంటలకు రాకెట్‌ను ప్రయోగించనున్నారు.
PSLV రాకెట్ C58 రాకెట్ జీవితకాలం ఐదేళ్లు. దీని పొడవు 44.4 మీటర్లు, బరువు 260 టన్నులు. ఇది ఎక్స్-రే మూలాల కోసం శోధిస్తుంది. తాజా ప్రయోగం PSLV రాకెట్ సిరీస్‌లో 60వది. ఎక్సోపోసాట్ ఉపగ్రహాన్ని భూమికి 350 నుంచి 450 కిలోమీటర్ల ఎత్తులో లియో కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం నాలుగు దశల్లో పూర్తవుతుంది. అయితే ఎక్స్పోసాట్ ఉపగ్రహంతో పాటు మరో పది పేలోడ్లను కూడా ఇస్రో అంతరిక్షంలోకి పంపనుంది. దీనికి PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ (POEM) అని పేరు పెట్టారు.