KKD: ఏలేశ్వరం మండలం ఎర్రవరం వద్ద జాతీయ రహదారి-16పై మంగళవారం ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సును తమిళనాడుకు చెందిన ఓ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని దాకారాయి గ్రామానికి చెందిన కుంజం నూకాలమ్మ స్వల్పంగా గాయపడ్డారు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే 108 అంబులెన్స్‌లో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.