KMM: ఏన్కూరులోని సాగర్ కాలువలో పడి ఓ మహిళ మృతి చెందిందని ఎస్ఐ రఫీ తెలిపారు. స్థానిక బీసీ కాలనీకి చెందిన దుగ్గిరాల శిరీష(24) బట్టలు ఉతకడానికి సమీపంలోని కాలువ వద్దకు వెళ్లగా, ప్రమాదపుషాత్తు కాలువలో పడి గల్లంతైంది. భర్త నాగరాజు కాలువ వద్దకు వెళ్లి చూడగా కనిపించకపోవడంతో స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం శిరీష మృతదేహం లభ్యమైంది.