కృష్ణా: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన అవనిగడ్డ – కోడూరు ప్రధాన రహదారిపై జరిగింది. శుక్రవారం కోడూరు మండలం విశ్వనాధపల్లికి చెందిన బత్తుల నాగరాజు(46) అవనిగడ్డ వెళ్లి వస్తుండగా రామచంద్రాపురం గ్రామం వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోయాడు. ప్రమాదంలో తలకి బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే నాగరాజు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.