»10 Kg Gold Was Lost In The Pashupatinath Temple Nepal Officials In The Field
Pashupatinath temple: గుడిలో 10 కిలోల గోల్డ్ మాయం..రంగంలోకి అధికారులు
ప్రముఖ పశుపతినాథ్ ఆలయం(pashupatinath temple)లో 10 కిలోల బంగారం మాయమైనట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అసలు ఏలా పోయిందనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
నేపాల్(nepal)లోని ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయం(pashupatinath temple)లో బంగారం అదృశ్యం కావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దాదాపు 100 కిలోల బంగారు ఆభరణాలు ఉండాల్సి ఉండగా అందులో 10 కిలోల నగలు మాయమైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది తెలుసుకున్న అక్కడి అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కొన్ని గంటలపాటు ఆలయ దర్శనాలు నిలిచిపోయాయి. అక్కడి సీసీ కెమెరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతోపాటు అక్కడకు వచ్చిన పలువురి భక్తుల కదలికలను కూడా సీసీ కెమెరాల ద్వారా అధికారులు గమనిస్తున్నారు.
ఖాట్మండులోని హిందూ దేవాలయాలలో పశుపతినాథ్ దేవాలయం అతి పురాతనమైనది. గతేడాది మహాశివరాత్రి సందర్భంగా శివలింగం చుట్టూ బంగారు(gold) జలహారిని ఏర్పాటు చేశారు. అందుకోసం పశుపతి ఏరియా డెవలప్మెంట్ అథారిటీ 103 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఆ ఆభరణాల్లో దాదాపు 10 కిలోల బంగారం కనిపించకుండా పోయిందని సమాచారం. అక్కడి పార్లమెంట్లోనూ ఈ అంశంపై ప్రశ్నలు సంధించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం నేపాల్ అవినీతి నిరోధక సంస్థ (సీఐఏఏ)ని విచారణకు ఆదేశించింది. రంగంలోకి దిగిన సీఐఏ అధికారులు ఆలయాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు.
బంగారంతో తయారు చేసిన జలహరి నాణ్యత, బరువుపై అవినీతి నిరోధక శాఖ అధికారులు(officers) ఆరా తీస్తున్నట్లు ఆలయ ట్రస్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఘనశ్యామ్ ఖతివాడి వెల్లడించారు. అందుకే కొన్ని గంటల పాటు దర్శనానికి అనుమతించలేదని తెలిపారు. ఈ క్రమంలో భక్తులను ఆలయంలోకి అనుమతించడం లేదని చెప్పారు. నేపాల్లో ప్రముఖ దేవాలయం కావడంతో అక్కడి ఆర్మీతో పాటు భారీ సంఖ్యలో భద్రతా సిబ్బంది ఆలయ ప్రాంగణంలో మోహరించారు.