»1 82 Kg Gold Seized At Shamshabad Airport Hyderabad
Gold seized: శంషాబాద్ ఎయిర్ పోర్టులో 29 కేజీల బంగారం పట్టివేత..!
ఓ వ్యక్తి ఎవ్వరికీ తెలియకుండా గుట్టుగా గోల్డ్ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ శంషాబాద్లో చోటుచేసుకుంది. అయితే అతని వద్ద 29 కేజీల గోల్డ్ ఉన్నట్లు తెలిసింది.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రయాణికుడి వద్ద బంగారం ఎక్కువగా ఉందనే సమాచారం అందడంతో ముందుగా అధికారులు సోదాలు చేశారు. కాగా ఈ తనిఖీలో అతని వద్ద దాదాపు 29 కేజీల బంగారం ఉన్నట్లు గుర్తించారు. ఈ బంగారాన్ని అతను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.
ఎమర్జెన్సీ లైట్లో బంగారాన్ని దాచి తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. ప్రయాణికుడి నుంచి దాదాపు రూ.1.82 కోట్ల విలువైన 2.915 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించామని.. అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.