AP: NTR జిల్లా జూపూడిలోని ఓ ఇంట్లో ఇవాళ రాత్రి భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇల్లు ధ్వంసం కాగా, ముగ్గురుకి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయవాడ GGHకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.