SKLM: సారవకోట మండలం అవలింగి గ్రామంలోని ఓ మద్యం దుకాణంలో 205 లీటర్ల నకిలీ మద్యం విక్రయిస్తున్న వారిని పట్టుకున్నట్లు ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి బుధవారం తెలిపారు. సూపరింటెండెంట్ పీ.మురళీధర్ ఆధ్వర్యంలో బృందం తనిఖీలు నిర్వహించి, నిందితులు మణికంఠ, సుందరరావును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేశామన్నారు.