SKLM: టెక్కలి నియోజకవర్గం మద్దిలవానిపేట గ్రామానికి చెందిన పెద్ద తామరపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యులు బి. బాలరాజు గురువారం మృతి చెందారు. ఈ సందర్భంగా YSRCP టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జి పి .తిలక్ బాలరాజు మృతదేహం వద్దకు వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.