నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో గురువారం ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమైన ఘటనలో, పెద్ద కూతురు మోక్షిత (8) మృతదేహం తాండ్ర సమీపంలో లభ్యం కావడంతో కలకలం రేగింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన తండ్రి వెంకటేశ్వర్లు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని ముగ్గురు పిల్లలు అదృశ్యం అయిన కేసులో ఈ విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి.