ELR: ఉంగుటూరు జాతీయ రహదారి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. నారాయణపురం నుండి ఉంగుటూరు వెళుతుండగా వెనక నుంచి ఒక వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి తీవ్ర గాయాలు కాగా, అతనిని హైవే అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియ రావలసి ఉంది.