అక్రమ ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో చైనాలోని ఝాంగ్ యాంగ్ గుయిజౌ కియానాన్ ప్రావిన్స్ గవర్నర్కు 13 ఏళ్ల జైలు శిక్ష పడింది. అలాగే, 10 లక్షల యువాన్లు (రూ.1.18 కోట్లు) జరిమానా విధించారు. అయితే, ఆమె అందం కారణంగా అక్కడి జనాలు ఇప్పటికీ ‘అందమైన గవర్నర్’ అని పిలుస్తారు. యాంగ్ 58 మంది మగ సహోద్యోగులతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నారని, దాదాపు 60 మిలియన్ యువాన్లు (రూ.71,02,80,719) లంచాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.