బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా, పుల్టా కాన్సెప్ట్ తో వచ్చిన విషయం తెలిసిందే. ఆ కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉండటంతో అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే, బీబీ యాజమాన్యం ఒక బ్యాచ్ కి మాత్రం ఫుల్ సపోర్ట్ గా నిలుస్తోంది అనే కామెంట్స్ మాత్రం ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు హౌస్ లో 10మంది ఉన్నారు. దానిలో స్పై బ్యాచ్ ఒకటి అయితే, సీరియల్ బ్యాచ్ మరొకటి కావడం గమనార్హం. సీరియల్ బ్యాచ్ లో అమర్ దీప్, ప్రియాంక, శోభలు ఎలిమినేట్ కాకుండా బీబీ యాజమాన్యం ప్రయత్నిస్తోందని, వారి కోసం స్క్రిప్ట్ మార్చడానికి కూడా రెడీగా ఉన్నారని నెటిజన్లు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రతివారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతూనే ఉన్నారు. అయితే.. పదకొండో వారంలో మాత్రం బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. గత వారం ఎవిక్షన్ పాస్ కోసం ఇంటి సభ్యులు గేమ్స్ ఆడారు. వారిలో ప్రిన్స్ యావర్ ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు.
కానీ వీకెండ్ లో నాగార్జున వచ్చి యావర్ చాలా తప్పులు చేసి గేమ్ గెలిచాడని ఆరోపించారు. దీంతో, యావర్ ఆ పాస్ నాకు వద్దు అని చెప్పడం విశేషం. అసలు ఈ పాస్ సీరియల్ బ్యాచ్ కి రావాలని బిగ్ బాస్ కూడా చాలా ప్రయత్నాలు చేసినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. కానీ యావర్ కి రావడం, చివరకు యావర్ దానిని వాడాలని అనుకోకపోవడం వల్ల బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చారు.
ఈ వారం నామినేషన్లలో అర్జున్, శోభాశెట్టి, అమర్, యావర్, రాధిక, అశ్విని, గౌతమ్ ఉన్నారు. ఆదివారం ఎపిసోడ్ లో అందరినీ సేవ్ చేసుకుంటూ వచ్చారు. అశ్విని, గౌతమ్ మాత్రమే మిగిలిపోవడంతో ఎలిమినేషన్ సస్పెన్స్ గరిష్ట స్థాయికి చేరుకుంది. చివరకు ఇద్దరూ సేవ్ చేయబడినట్లు ప్రకటించారు. ఎలిమినేషన్ లేకపోవడం ప్రిన్స్ యావర్ ఎవిక్షన్ పాస్‌ను తిరిగి ఇవ్వడంతో ముడిపడి ఉందని హోస్ట్ నాగార్జున వివరించారు. పార్టిసిపెంట్లు దానిని పొందేందుకు మరొక అవకాశాన్ని అందిస్తున్నారు.
డబుల్ ఎలిమినేషన్ ప్రకటించిన నాగార్జున తర్వాతి వారానికి ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం హౌస్మేట్స్ జాబితాలో శివాజీ, అర్జున్, అమర్దీప్, శోభా శెట్టి, ప్రియాంక, అశ్విని, యావర్, పల్లవి ప్రశాంత్, రతిక , గౌతమ్ ఉన్నారు. రాబోయే డబుల్ ఎలిమినేషన్ షోకి సస్పెన్స్ ఉండబోతోంది. అందుకే వీక్షకులకు ఆ ఎపిసోడ్ పై ఎంతో ఆసక్తి ఉంది. ఎవిక్షన్ పాస్ కోసం బిగ్ బాస్ మరో టాస్క్ పెట్టాలనుకుంటే, యావర్ నుండి పాస్ తీసుకోడు. ఎవరైనా అమర్ లేదా శోభా శెట్టి కోసం ఉపయోగించే విధంగా వారు ఉద్దేశపూర్వకంగా చేసారు. ఆట ‘స్టార్ మా’ బ్యాచ్‌కి అనుకూలంగా మారుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మరి ప్రస్తుత వారం నామినేషన్ల జోరు ఎలా ఉంటుందో చూడాలి.