KRNL: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నారు. జిల్లాకు విచ్చేసిన ఆయనకు ఆర్ అండ్ బి శాఖ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. గుంతల రహిత రహదారుల పనులను సకాలంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని
MBNR: ఎర్ర సత్యం కాలనీలో ఉన్న చెరువులో నుంచి నీటిని ఇసుక మాఫియా దారులు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఇసుక ఫిల్టర్ చేసేందుకు దీనిని వాడుతున్నారని చెప్పారు. వీరి అక్రమ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడ
ATP: 2024-25 ఆర్థిక సంవత్సరంలో అనంతపురం జిల్లాలో స్వయం ఉపాధి పథకానికి 477 మంది లబ్ధిదారులకు రూ.11.61 కోట్ల మెగా చెక్కును ఎంపీ అంబికా నారాయణ, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అందజేశారు. స్వయం ఉపాధి పథకానికి సంబంధించి మండలాల వారిగా లబ్ధిదారులను ఎంపిక చేసి, చె
KRNL: పెద్దకడబూరు మండలంలోని తారాపురంలో వెలసిన శ్రీ గిడ్డాంజనేయస్వామికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి జలాభిషేకం, ఆకుపూజ, కుంకుమార్చన, బిల్వార్చన, పంచామృతాభిషేకంతో ప్రత్యేక పూజలు చేశారు. చుట్టు పక్కల ప్రాంతా
TG: హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కేసరి కుస్తీ పోటీలు శుక్రవారం రాత్రి ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 450 మందికిపైగా క్రీడాకారులు పోటీ
SKLM: నరసన్నపేట మండలం దూకులపాడు గ్రామ పాఠశాల ఉపాధ్యాయులు చిన్నికృష్ణ ఆధ్వర్యంలో శనివారం అడ్మిషన్ డ్రైవ్ చేపట్టారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల
SKLM: జిల్లా ఆమదాలవలస మండలం చిన్న జొన్నవలస గ్రామంలో త్రాగునీటి బావిని వినియోగంలోనికి తెచ్చే విధంగా సంబంధిత అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని స్థానికులు రెడ్డి రామారావు, ఎం.మల్లేష్ శనివారం తెలిపారు. బావి పై నందలు తక్కువ ఎత్తు ఉండడంతో చిన్
SKLM: ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఫస్టియర్ 20,389 మంది, సెకండియర్ 19,967 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 40,356 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు
ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలోని మంగంపల్లి గ్రామంలో శనివారం నుంచి మూడు రోజులపాటు మంగమ్మ తల్లి సమేత గరటయ్య స్వామి తిరునాళ్ల కార్యక్రమం జరగనుంది. ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చ
SKLM: నరసన్నపేట మండలం, మండపాం హైవే బ్రిడ్జ్ పై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వైపు కోడి గుడ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడమే కారణంగా తెలుస్తోంది. డ్రైవర్ స్వల్ప