ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలోని మంగంపల్లి గ్రామంలో శనివారం నుంచి మూడు రోజులపాటు మంగమ్మ తల్లి సమేత గరటయ్య స్వామి తిరునాళ్ల కార్యక్రమం జరగనుంది. ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీసులు తిరుణాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు చర్యలను చేపట్టారు.