GDWL: ధరూర్ మండల కేంద్రంలో శనివారం నిర్వహించే తెలంగాణ భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సు కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రానున్నారని ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ బియం సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాస రావుతో కలిసి సభా స్థలాన్ని పరిశీలించి రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.