BPT: నవోదయం 2.O కార్యక్రమం సందర్భంగా గురువారం బాపట్లలోని బేతపూడి, స్టువర్టుపురం గ్రామాలలో నాటుసారా తయారీ, అమ్మకం, రవాణా గురించి ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించబడింది. బాపట్ల ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నాటుసారా సంభందిత చర్యలు చట్టవిరుద్ధమని, ఈ చర్యలకు పాల్పడిన వారికి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.