పల్నాడు: సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శనివారం పర్యటన వివరాలను ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో విడుదల చేసింది. ఉదయం 10:30 గంటలకు సత్తెనపల్లి మార్కెట్ యార్డ్లో ప్రమాణ స్వీకార మహోత్సవ పనులను పరిశీలిస్తారు. 11:30 గంటల నుంచి సత్తెనపల్లి కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజలు, కార్యర్తలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.