GNTR: గుంటూరు తూర్పు పరిధిలోని లాలాపేట స్టేషన్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు.తెల్లవారుజామున 2 గంటల సమయంలో సంగడిగుంటలో ఏఎస్సై నరసింహారావు, కానిస్టేబుల్ నాగరాజు గస్తీ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి వచ్చి తన భార్య కాన్పు నొప్పులతో బాధపడుతుందని, వాహన సదుపాయం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు గర్భిణిని తమ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.