SKLM: ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఫస్టియర్ 20,389 మంది, సెకండియర్ 19,967 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 40,356 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.