సత్యసాయి: మంత్రి అనగాని సత్యప్రసాద్ రేపు సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం ఆయన విజయవాడ నుంచి బయలుదేరి బెంగళూరుకు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గాన ఉదయం 9.30 గంటలకు మడకశిరకు చేరకుంటారని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, అధికారులతో కలిసి నియోజకవర్గంలో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు.