TG: హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కేసరి కుస్తీ పోటీలు శుక్రవారం రాత్రి ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 450 మందికిపైగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. 3 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయి.