NDL: హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంబార్కేషన్ కేంద్రాల వద్ద ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసినట్లు న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. గురువారం నంద్యాల నేషనల్ పీజీ కళాశాలలో జిల్లా హజ్ కమిటీ అధ్యక్షుడు డా. ఎస్. ఇంతియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.