వాంఖడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. రోహిత్ శర్మ (26), రికెల్టన్ (31), విల్ జాక్స్ (36), సూర్యకుమార్ యాదవ్ (26), తిలక్ వర్మ (21*) పరుగులు చేశారు. SRH బౌలర్లలో కమిన్స్ 3 వికెట్లు తీశాడు.