SKLM: జిల్లా ఆమదాలవలస మండలం చిన్న జొన్నవలస గ్రామంలో త్రాగునీటి బావిని వినియోగంలోనికి తెచ్చే విధంగా సంబంధిత అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని స్థానికులు రెడ్డి రామారావు, ఎం.మల్లేష్ శనివారం తెలిపారు. బావి పై నందలు తక్కువ ఎత్తు ఉండడంతో చిన్నారులు ఆదమరిస్తే బావిలో పడే ప్రమాదం ఉందని అన్నారు. అలాగే నీటికి క్లోరినేషన్ చర్యలు చేపట్టాలని కోరారు.