కేసీఆర్ దుష్టపాలనకు కామారెడ్డి చరమగీతం పాడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.తెలంగాణ ప్రజల భవిష్యత్తను కామారెడ్డి ప్రజానీకం నిర్ణయించబోతుందన్నారు.
ఆఖరి నిమిషంలో వేములవాడ అసెంబ్లీ టికెట్‌ను బీజేపీ మార్చడంతో తుల ఉమ కంటతడి పెట్టారు. బీసీ మహిళలకు పార్టీలో గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు గడువు నేటి సాయంత్రంతో ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగిసింది. 3 గంటల తర్వాత లైన్లో ఉన్నవారికి మాత్రం నామినేషన్లు వేసే అవకాశం కల్పించింది
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తును కేటాయించలేదు
ఆధార్ కార్డులతో అనుసంధానించని 11.5 కోట్ల పాన్ కార్డులను కేంద్రం డీయాక్టివేట్ చేసింది. ఇండియాలో మొత్తం 70.24 కోట్ల పాన్ కార్డులుండగా.. అందులో 13 కోట్ల కార్డులు ఆధార్‌తో లింక్ కాలేదు.
నామినేషన్ వేసే సందర్భంలో ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్- బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.
దీపావళి ఫెస్టివల్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. లైఫ్ స్టైల్ ఏసియా కూడా గ్రాండ్‌గా నిర్వహించింది.
కానిస్టేబుల్‌పై మోజుతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు సీఐ ఇఫ్తికర్. శకుంతలను వేధించడంతో ఆమె భర్త కానిస్టేబుల్ జగదీశ్ దాడి చేశాడు. తీవ్రగాయాలతో సీఐ ఆస్పత్రిలో చనిపోయాడు.
పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం మంచి పద్ధతి కాదని సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో నేతలు ఆస్తులు, అప్పుల వివరాలు ప్రకటిస్తున్నారు. ఒక్కో నేత తనకు కారు లేదని పేర్కొన్నారు. వందల కోట్ల ఆస్తి కలిగి ఉన్నానని.. కానీ తన పేరు మీద కార్లు లేవని చెబుతున్నారు.