Narsingh police have issued notices to Rajtarun to attend the investigation in the Lavanya case
Raj Tarun: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్ (Raj Tarun)-లావణ్య (lavanya) కేసు గురించి తెలిసిందే. ఈ కేసులో బాధితురాలి ఫిర్యాదు మేరకు హీరో రాజ్ తరుణ్‌పై నార్సింగ్ పోలీసులు ఐపీసీ 420, 493, 506 సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేశారు. ఇందులో ఏ1గా రాజ్ తరుణ్, ఏ2గా మాల్వీ మల్హోత్రా, ఏ౩గా మాల్వీ సోదరుడు మయాంక్ మల్హోత్రాను చేర్చారు. ఈ మేరకు జూలై 14న నోటీసులు జారీ చేశారు. 18న విచార విచారణకు రావాలని తెలిపారు. బీఎన్ఎస్ఎస్ 45 కింద ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.
రాజ్ తరుణ్ తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి ఇప్పడు దూరం పెట్టాడని లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకొన్నాడు, తనకు ప్రాణహాని ఉందని తగిన ఆధారాలు అందించింది. ఇక రాజ్ తరుణ్‌తో ప్రేమలో ఉన్న సమయంలోనే రూ. 70 లక్షలు ఇచ్చామని లావణ్య తెలిపారు. 2016లో రాజ్ తరుణ్ వలన లావణ్య గర్భం వచ్చిందని తరువాత అబార్షన్ చేయించాడని తెలిపింది.