ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ సమన్లు పంపింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని తెలిపింది. ఈ కేసులో కవితను నిందితురాలిగా చేర్చడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరం మొదలైంది.
CBI summons Kavitha to appear for investigation in liquor scam
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ను విచారణకు హాజరు కావాలంటూ తాజాగా సమన్లు పంపింది. ఈ కేసులో కవితను సీబీఐ(CBI) నిందితురాలిగా చేర్చింది. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి ఈనెల 26న విచారణకు రావాలని 41ఏ కింద సమన్లు జారీ చేసింది. ఇంతకు ముందే 26న విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఆ సమయంలో ఇచ్చిన నోటీసుల్లో కవితను సాక్షిగా పేర్కొంది. ఇప్పుడు సీబీఐ దాన్ని సవరిస్తూ నిందితురాలిగా పేర్కొంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులను కలవరం మొదలైంది.
గత సంవత్సరం డిసెంబర్ నెలలో కవితను సీబీఐ విచారించింది. ఆ తరువాత ఈడీ మూడు సార్లు విచారణ జరిపింది. ఇప్పుడు తాజాగా మళ్లీ హాజరు కావాలంటూ సమన్లు పంపించింది. ఈసారి సీబీఐ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరవుతారా, లేదా కోర్టును ఆశ్రయిస్తారా అనేది తెలియాలి. ఇదే కేసులో గతంలో సాక్షిగా ఉన్న కవితను తాజగా నిందితురాలగా మార్చడంతో జరగబోయే పరిణామాలపై అందరిలో ఆసక్తి నెలకొంది.