Six people were killed in one family nizamabad telangana
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈకేసులో లోకేష్ కు 41ఏ నోటీసులు ఇస్తామని, నిబంధనలు పాటిస్తామని కోర్టుకు తెలిపారు. అయితే 41ఏ నోటీసుల నేపథ్యంలో అరెస్టు ప్రస్తావన రాలేదు. ఈ క్రమంలో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి చెప్పారు.
అయితే ఈ కేసులో ఇప్పటికే నారా లోకేష్‌ను ఏపీ సీఐడీ ఏ14గా పేర్కొంది. ఈ క్రమంలో ఈ కేసు విచారణకు సహకరించాలని లోకేష్ ను కోర్టు ఆదేశించింది. లోకేష్ కు 41ఏ నోటీసులు ఇవ్వాలని చెప్పింది. కోర్టు ఆదేశాల మేరకు లోకేష్ కు 41ఏ నోటీసులను ఏపీ సీఐడీ అందజేయనుంది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఐడీ బృందం.. కాసేపట్లో లోకేష్ కు నోటీస్ ఇవ్వనుంది. అయితే కేవలం నోటీసులు మాత్రమే ఇస్తారా లేదంటే సహకరించలేదనే పలు కారణాలతో అరెస్ట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.