తమిళనాడుకు కావేరీ జలాల్ని విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక వ్యాప్తంగా పలు సంఘాలు ఈరోజు బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పలు చోట్ల 144 సెక్షన్ విధించి ప్రజలను అప్రమత్తం చేశారు.
కర్ణాటక రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. కావేరి(Cauvery)నది జలాలను తమిళనాడు రాష్ట్రానికి రిలీజ్ చేయడాన్ని నిరసిస్తూ పలు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రకటించారు. పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. దీంతోపాటు బెంగళూరులో బంద్ సందర్భంగా శుక్రవారం పోలీసు సిబ్బందిని పెద్ద ఎత్తున మోహరించారు. బంద్ కారణంగా రవాణాకు అంతరాయం ఏర్పడింది. కానీ కర్ణాటక నుంచి తమిళనాడుకు యథావిధిగా బస్సులు నడుస్తున్నాయి. దీనిలో భాగంగా మాండ్యాలో 144 సెక్షన్ విధించారు.
#WATCH | Pro-Kannada outfits in Karnataka’s Hubballi stage protest over the Cauvery water release to Tamil Nadu. pic.twitter.com/V8nLFNzg47
అనేక మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. కర్ణాటక రక్షణ వేదిక, కన్నడ చలవలి సహా పలు సంఘాలు ఈ రోజు ఉదయం నుంచి నిరసనలు తెలపాలని పిలుపునిచ్చాయి. ఈ బంద్ దృష్ట్యా కర్ణాటక పోలీసులు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసనకారులు టౌన్ హాల్ నుంచి బెంగళూరులోని ఫ్రీడమ్ పార్కు వరకు భారీ నిరసన ప్రదర్శన చేశారు. బంద్ సందర్భంగా రోడ్లపై వాహనాలు, విమానాలను కూడా అడ్డుకుంటామని ఆయా సంఘాలు ప్రకటించాయి. రాజ్ భవన్ ముందు ఆందోళనకారులు నిరసన తెలిపారు. బంద్ కు ఆటో సంఘాలు కూడా మద్ధతు ప్రకటించాయి. ఆటోరిక్షా డ్రైవర్స్ యూనియన్, ఓలా, ఉబర్ డ్రైవర్లు, కార్ల యజమానుల సంఘం బంద్కు సపోర్ట్ చేస్తున్నట్లు ఆటో సంఘం అధ్యక్షుడు తన్వీర్ పాషా చెప్పారు. ఇక విద్యా సంస్థలు, ప్రైవేట్ క్యాబ్ సేవలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు అన్నింటిని కూడా మూసివేశారు.