»Manipur Churachandpur District Internet Services Shut Down 144 Section
Manipur:లో ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలు బంద్, 144 సెక్షన్
మణిపూర్(Manipur) రాష్ట్రంలో శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్(cm biren singh) పర్యటనకు ముందు ఆయన కార్యక్రమ వేదికకు దుండగులు నిప్పు పెట్టారు. దీంతో చురచంద్‌పూర్ జిల్లాలో అధికారులు ఇంటర్నెట్ను తాత్కాలికంగా నిలిపివేసి 144 సెక్షన్ విధించారు.
మణిపూర్(Manipur) రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చురచంద్‌పూర్ జిల్లా(Churachandpur District)లో శుక్రవారం రాత్రి మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఓ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. ఆ క్రమంలో వేదికను కొంత మంది దుండగులు ధ్వంసం చేసి తగలబెట్టారు. అంతేకాదు న్యూ లాంకాలోని పీటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్మించిన ఓపెన్ జిమ్‌ను ధ్వంసం చేసి, పాక్షికంగా తగలబెట్టారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. దీంతోపాటు అధికారులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు(police) వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే చర్యకు దిగిన గుంపును చెదరగొట్టారు. అయితే వేదిక అప్పటికే వందలాది కుర్చీలతో ధ్వంసమైంది. పరిస్థితి అదుపు తప్పడంతో చురచంద్‌పూర్ యంత్రాంగం జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేసింది. అయితే పరిస్థితి మాత్రం ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఆందోళనకు గురైన గుంపు వేదిక లోపల కుర్చీలు, ఇతర ఆస్తులను పగలగొట్టడం అక్కడి సీసీ కెమెరాల్లో(cc camera) రికార్డైంది.
శుక్రవారం మధ్యాహ్నం బీరేన్ సింగ్ ప్రారంభించనున్న న్యూ లాంకాలోని పిటి స్పోర్ట్స్ కాంప్లెక్స్(pt sports complex)లో కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను పాక్షికంగా తగలబెట్టిందని పోలీసులు తెలిపారు. అయితే హింసాకాండ కారణంగా ముఖ్యమంత్రి కార్యక్రమం రద్దయిందా అనే విషయాన్ని జిల్లా యంత్రాంగం ఇంకా నిర్ధారించలేదు.
మరోవైపు కొందరు సోషల్ మీడియాలో సీఎం బీరెన్ సింగ్(cm biren singh) పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంసీ టౌతాంగ్ అనే వ్యక్తి సీఎం(CM) విభజన సహా ఆందోళన కలిగించే రాజకీయాలు చేస్తున్నారని వెలుగులోకి వచ్చింది. ఇంకోవైపు రైతులు, గిరిజనుల రిజర్వ్ ప్రాంతాలను ఖాళీ చేయించాలని అదే జిల్లాలో నిర్వాసితులు ఆందోళన చేయడం కూడా చర్చనీయాశంగా మారింది.
Tension grips #Manipur’s Churachandpur after an irate mob reportedly vandalised & partially torched the open gym constructed at PT Sports Complex in New Lamka which was to be inaugurated by CM N Biren Singh today. In view of the prevailing situation, internet services suspended &… pic.twitter.com/iGgCXCiPAa