Gold and Silver Rates Today : బంగారం, వెండి ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. గత పది రోజులుగా వీటి ధరలు రెండు మూడు రోజులు పెరగడం, ఒక రోజు కాస్త తగ్గడం అన్నట్లుగా ట్రెండ్ నడుస్తోంది. మొత్తం మీద వీటి ధరలు పెరగడమే గాని, తగ్గడం లేదనే చెప్పాలి. మరి ఇవాళ బంగారం ధర ఎంత ఉందో తెలుసుకుందాం రండి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి ధర నేడు స్వల్పంగా పెరిగింది. రూ.375 పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ.75,585కి చేరింది.
చదవండి : రెండు రోజులు లిఫ్ట్లోనే ఇరుక్కుపోయిన రోగి.. ప్రాణాలతో బయటకి!
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ పసిడి ధర(Gold Rate)లు ఇలాగే ఉన్నాయి. విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడల్లోనూ 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.75,585గానే ఉంది. ఈ ధర మార్కెట్ ప్రారంభ సమయంలో నమోదైనది మాత్రమే. తర్వాత మళ్లీ మారే అవకాశాలుంటాయి. అలాగే నగల కొనుగోలుదారులు మాత్రం ఈ ధరకు అదనంగా రాళ్లు, జీఎస్టీ, మజూరీల్లాంటివీ చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.
చదవండి : ట్రంప్.. షూటర్ తండ్రి పేరిట 20 తుపాకీలు
ఇక వెండి ధరలు(Silver Rates) మాత్రం ఈ మధ్య కాలంలో అస్సలు దిగి రావడం లేదు. మంగళవారం కూడా రూ.70 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.94,510కి చేరుకుంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ తదితర చోట్ల సైతం దీని ధరలు ఇలాగే ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు మాత్రం భారీగా పెరిగాయి. ఔన్సు స్పాట్ గోల్డ్ మంగళవారం 16 డాలర్లు పెరిగి 2428 డాలర్లకు చేరుకుంది. ఔన్సు వెండి 30.82 డాలర్లుగా ఉంది.

