»Thomas Matthew Crooks Used An Ar Style 556 Rifle To Shoot Donald Trump
Donald Trump : ట్రంప్.. షూటర్ తండ్రి పేరిట 20 తుపాకీలు
డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిపిన షూటర్ థామస్ మ్యాథ్యూ క్రూక్స్ తండ్రి పేరు మీద ఏకంగా 20 తుపాకీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Thomas Matthew Crooks Used An Ar Style 556 Rifle : రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై థామస్ మ్యాథ్యూ క్రూక్స్(Thomas Matthew Crooks) అనే 20 ఏళ్ల యువకుడు కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ఇతడి తండ్రి పేరు మీద ఏకంగా 20 రైఫిల్స్( Rifles) ఉన్నట్లు గుర్తించారు. వాటన్నింటినీ ఆయన లైసెన్సులతో కొనుక్కున్నారు. వాటిలో 556 అనే సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో మ్యాథ్యూ ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. ఈ తుపాకీని అతడి తండ్రి 2013లో కొనుగోలు చేశారు.
మ్యాథ్యూ(Matthew) ఫోన్లోని సమాచారాన్ని పోలీసులు విజయవంతంగా యాక్సస్ చేశారు. దానిలో నిక్షిప్తమైన వివరాల ఆధారంగా అతడి కాల్పులకు గల కారణాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అతడడికి మానసిక పరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలోనూ విచారిస్తున్నారు. అతడు గతంలోనే ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీలో సభ్యుడిగా పేరు నమోదు చేసుకున్నాడని తెలిపారు.
కాల్పుల్లో మృతి చెందిన అతడి కారులో ఓ అనుమానాస్పద వస్తువుని సైతం పోలీసులు గుర్తించారు. బాంబ్ టెక్నీషియన్లతో దాన్ని పరీక్షింప చేయిస్తున్నారు. కారు నుంచి కొన్ని పేలుడు పదార్థాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. అతడు చదువుకున్న స్కూల్ నుంచి కూడా అతడి పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. మ్యాథ్యూ ఎప్పుడూ ఒంటరితనంతో బాధగా ఉన్నట్లుగా కనిపించేవాడని తోటి విద్యార్థులు తెలిపారు. అతడి డ్రసింగ్ కూడా భిన్నంగా ఉండేదంటూ చెప్పుకొచ్చారు. దీంతో తోటి విద్యార్థులు అతడిని ఎప్పుడూ గేలి చేస్తూ ఉండేవారని అన్నారు. ఎవరితోనూ అతడు పెద్దగా మాట్లాడేవాడు కాదని తెలిపారు. అయితే ప్రస్తుత రాజకీయాల గురించి, డొనాల్డ్ ట్రంప్(Donald Trump) గురించి మాత్రం మాట్లాడుతూ ఉండేవాడని అన్నారు.