టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి తన పదవీకి రాజీనామా చేశారు. లేఖను గవర్నర్ తమిళి సై సౌందర రాజన్కు పంపించగా ఆమోదించి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు.
ఇటీవల కుంగిన మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ఏర్పాట్లు చేయాలని నీటి పారుదల శాఖ అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సమీక్ష నిర్వహించారు.
11 మంది సిట్టింగులను వైసీపీ మార్చింది. వచ్చే ఎన్నికల్లో 175 చోట్ల గెలవాలని.. అందుకోసమే మారుస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో ఒకరిద్దరూ ఆగ్రహాం వ్యక్తం చేశారు.
యానిమల్ మూవీలో నటనకు గానూ తృప్తి డిమ్రికి నేషనల్ క్రష్ ఇమేజ్ వచ్చింది. కానీ తల్లిదండ్రులను మాత్రం దూరం చేసింది. ఆ మూవీలో కొన్ని సీన్లను చూసి.. ఇవి నువ్వే చేశావా..? గతంలో ఎవరూ ఇలా చేయలేదు కదా అని ప్రశ్నించారట.